Vikarabad District: వికారాబాద్‌ జిల్లాలో కుమ్మేసిన వర్షం .. తెగిపోయిన కాగ్నా వంతెన

Heavy rains in Vikarabad dist

  • గత రాత్రి నుంచి ఉదయం వరకు కురుస్తూనే ఉన్న వర్షం
  • కొడంగల్-తాండూరు మధ్య రాకపోకలు బంద్
  • నీట మునిగిన పంట పొలాలు

వికారాబాద్ జిల్లా తాండూరులో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి కాగ్నా వంతెన తెగిపోయింది. దీంతో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. భారీ వర్షం కారణంగా కాగ్నా నదిపై ఉన్న కొడంగల్-తాండూరు బ్రిడ్జి తెగిపోవడంతో ఈ రెండింటి మధ్య సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, వరద నీటితో కాగ్నా నది పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షం కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా నిండి కళకళలాడుతున్నాయి. గత అర్ధరాత్రి నుంచి ఈ తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు.

Vikarabad District
Tandur
Kodangal
Heavy rain
  • Loading...

More Telugu News