Google: ఇండియాలో అందుబాటులో లేకుండా బ్లాక్ చేశాం: చైనా యాప్స్ పై గూగుల్
- 59 చైనా యాప్స్ పై భారత్ నిషేధం
- గూగుల్ ప్లేస్టోర్ లోనే ఉంచామన్న గూగుల్
- సమాచారం యాప్స్ డెవలపర్లకు అందజేత
చైనాతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి సంబంధించిన 59 యాప్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ యాప్స్ కు సంబంధించి గూగుల్ కీలక ప్రకటన చేసింది. భారత ప్రభుత్వం నిషేధించిన యాప్స్ ను గూగుల్ ప్లేస్టోర్ లోనే ఉంచామని... అయితే ఇండియాలో అందుబాటులో లేకుండా తాత్కాలికంగా బ్లాక్ చేశామని వెల్లడించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా యాప్స్ డెవలపర్లకు అందించామని తెలిపింది. సోమవారం నాడు చైనాకు చెందిన టిక్ టాక్, షేరిట్, వీచాట్, యూసీ బ్రౌజర్ తదితర 59 యాప్స్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.