MP: రేపు ఢిల్లీ వెళుతున్న వైసీపీ ఎంపీలు... రఘురామకృష్ణరాజు అంశంపై స్పీకర్ తో సమావేశం

YSRCP MPs goes to Delhi to meet speaker Om Birla
  • పార్టీకి, రఘురామకృష్ణరాజుకు మధ్య యుద్ధం
  • ఇప్పటికే రఘురామకృష్ణరాజుకు షోకాజ్ నోటీసులు
  • నోటీసులపై తీవ్రంగా స్పందించిన నరసాపురం ఎంపీ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం అటో, ఇటో తేల్చేయాలని వైసీపీ అధినాయకత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు రేపు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళుతున్నారు. వారు స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వారు స్పీకర్ ను కోరనున్నారు. అనేక అంశాల నేపథ్యంలో వైసీపీ అధినాయకత్వం రఘురామకృష్ణరాజుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా పంపారు.

సంజాయిషీ ఇవ్వకపోగా, ఆ షోకాజ్ నోటీసులనే ప్రశ్నించడం ద్వారా రఘురామకృష్ణరాజు మరింత ఆజ్యం పోశారు. వైసీపీ హైకమాండ్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీకి దూరం కావాలన్న ఉద్దేశంతోనే రఘురామకృష్ణరాజు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నది వైసీపీ నేతల ఆరోపణ. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన నరసాపురం ఎంపీ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి స్పీకర్ ను, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తన వాదనలు వినిపించారు. రేపు వైసీపీ ఎంపీలు కూడా స్పీకర్ ను కలవనుండడంతో ఈ అంశంలో మరింత ఆసక్తి ఏర్పడింది.
MP
YSRCP
Raghurama Krishnamraju
New Delhi
Lok Sabha Speaker
Om Birla
Jagan
Vijay Sai Reddy
Andhra Pradesh

More Telugu News