Telangana: ఇప్పట్లో బడులు తెరిపించేది లేదని స్పష్టం చేసిన తెలంగాణ!

No Dession on Schools Reopen in Telangana as off now
  • ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
  • ఆన్ లైన్ క్లాసులపైనా మార్గదర్శకాలు జారీ చేయలేదు
  • వెల్లడించిన పాఠశాల విద్యా శాఖ
కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్న వేళ, రాష్ట్రంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించే దిశగా ఎటువంటి నిర్ణయమూ ఇప్పటివరకూ తీసుకోలేదని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్నీ వెలువరించలేదని, తాము కూడా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని, ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూల్స్ తెరిచేందుకు ఎలాంటి అనుమతులూ లేవని అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆన్ లైన్ తరగతుల నిర్వహణపైనా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిత్రా రామచంద్రన్ తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే, పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని తన ఉత్తర్వులలో ఆమె స్పష్టం చేశారు.
Telangana
Chitra Ramachandra
Schools

More Telugu News