Oxfard: తమ వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేసిన ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్!

Corona Vaccine of Oxford Works on Low Imunity too

  • రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నా ప్రభావం
  • ప్రతి ఒక్కరికీ సురక్షితమైనదే
  • 5 వేల మందిపై ప్రయోగం

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు తాము తయారు చేస్తున్న వాక్సిన్ కు ప్రస్తుతం బ్రెజిల్ లో తొలి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని వెల్లడించిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సారా గిల్ బర్ట్, శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలోనూ ఈ వ్యాక్సిన్ పనిచేస్తున్నదని కీలక ప్రకటన చేశారు. ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేని వారికీ ఇది సురక్షితమైనదేనని తెలిపారు. ఈ వాక్సిన్ ఇచ్చిన వారిలో వైరస్ ను ఎదుర్కొనే శక్తి గణనీయంగా పెరుగుతోందని ఆయన అన్నారు. తాజాగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

మొత్తం 5 వేల మంది బ్రెజిల్ వాలంటీర్లపై పరీక్షిస్తున్నామని, యూకే, సౌతాఫ్రికాల్లో మానవులపై పరిశీలించిన వ్యాక్సిన్ నే ఇక్కడా ప్రయోగిస్తున్నామని తెలిపారు. ఊపిరితిత్తులలో స్వల్ప ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే అడినోవైరస్ ఆధారంగా 'సీహెచ్ఏడీ ఓఎక్స్1' వ్యాక్సిన్ తయారైందని, దీనిలో అడినో వైరస్ కు చెందిన కొన్ని జీన్స్ ను తొలగించామని, అందువల్లే ఇది శరీరం అంతటా వ్యాపించదనీ, ఆ కారణంగా ఈ వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి తక్కువగా వున్న వారికి కూడా క్షేమదాయకమని చెప్పారు. ఇది సజీవమైన వైరస్ కాబట్టి శరీరంలోకి వెళ్లిన తరువాత, వెంటనే యాంటీ బాడీలు తయారవుతాయని, ఇవి కరోనాపైనా పోరాడే శక్తిని కలిగివుంటాయని అన్నారు.

  • Loading...

More Telugu News