Tamannaah: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Tamannas key role in Vakeel Sab

  • 'వకీల్ సాబ్'లో ప్రత్యేక పాత్రలో తమన్నా 
  • నెలాఖరు నుంచి ప్రభాస్ షూటింగ్
  • రవితేజ తదుపరి చిత్రంలో రాశిఖన్నా

*  ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా 'వకీల్ సాబ్' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. వేణు శ్రీరాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో తమన్నా నటించే అవకాశం వుంది. ఈ విషయమై ప్రస్తుతం నిర్మాత ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.
*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తదుపరి షూటింగ్ ఈ నెలాఖరు నుంచి మొదలవుతుంది. హైదరాబాదులో వేస్తున్న సెట్స్ లో ఈ షూటింగ్ నిర్వహిస్తారు. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 'రాధే శ్యామ్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.
*  ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన ఓ చిత్రంలో నటిస్తున్న కథానాయిక రాశిఖన్నాకు టాలీవుడ్ నుంచి మరో ఛాన్స్ వచ్చింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించే చిత్రంలో రాశిఖన్నాను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుతం రవితేజ చేస్తున్న 'క్రాక్' చిత్రం తర్వాత ఇది మొదలవుతుంది.

Tamannaah
Pawan Kalyan
Prabhas
Pooja Hegde
  • Loading...

More Telugu News