Prakash Raj: వెబ్ సీరీస్ లో నటిస్తున్న ప్రముఖ నటుడు!

Prakash Raj joins web series

  • బిజీ తారల్ని సైతం ఆకర్షిస్తున్న వెబ్ సీరీస్ 
  • మంచి పాత్రలు, మంచి పారితోషికాల ఆఫర్ 
  • ఓ వెబ్ సీరీస్ కి ఓకే చెప్పిన ప్రకాశ్ రాజ్ 

ఇప్పుడు డిజిటల్ ప్రపంచం అందర్నీ ఆకర్షిస్తోంది. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతబడడంతో చాలామంది ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాం వైపు చూస్తున్నారు. ముఖ్యంగా వెబ్ సీరీస్ లో నటించడానికి ఆర్టిస్టులు ఆసక్తి చూపుతున్నారు. లాక్ డౌన్ కి ముందు నుంచీ కొందరు తారలు వెబ్ సీరీస్ వైపు వచ్చినప్పటికీ, ఇప్పుడు ఇది మరింత ఎక్కువైంది. ఆకర్షణీయమైన పారితోషికాలతో పాటు మంచి క్యారెక్టర్లు పోషించే అవకాశాలు వస్తుండడంతో వెబ్ సీరీస్ లో నటించడానికి బిజీ తారలు సైతం ఉత్సాహం చూపిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ క్యారెక్టర్ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా తొలిసారిగా వెబ్ సీరీస్ లో నటించడానికి రెడీ అయ్యారు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్న వెబ్ సీరీస్ లో ప్రధాన పాత్ర పోషించడానికి ఆయన అంగీకరించారు. అంతేకాదు, దానికి స్క్రిప్టు కూడా ఆయనే సమకూరుస్తున్నారు. ఇటీవలి కాలంలో దేశంలోని పలుచోట్ల చోటుచేసుకున్న కొన్ని వాస్తవ సంఘటనలతో ఈ వెబ్ సీరీస్ రూపొందుతోందని తెలుస్తోంది.

Prakash Raj
Anil Sunkara
OTT
Web series
  • Loading...

More Telugu News