New Delhi: భారత్‌లోని చైనా పౌరులకు ట్యాక్సీ సేవలు బంద్: ట్రావెల్ అసోసియేషన్

Delhi taxi association boycott chinese

  • ఇప్పటికే సేవలు బంద్ చేసిన హోటళ్లు
  • తమ ట్యాక్సీలలో చైనీయులకు ప్రవేశం లేదంటూ నోటీసులు
  • చైనాపై ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం

దేశంలోని చైనా పౌరులకు ట్యాక్సీ సేవలు అందించబోమని టూర్ అండ్ ట్రావెల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. తమ ట్యాక్సీలలో చైనా పౌరులను ఎక్కించుకునే ప్రసక్తే లేదని అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కమల్ చిబ్బర్ పేర్కొన్నారు. తమ అసోసియేషన్‌లో 500 మందికిపైగా ట్యాక్సీ ఆపరేటర్లు, ట్రావెల్ యజమానులు భాగస్వాములుగా ఉన్నారన్న ఆయన.. చైనీయులకు సేవలు అందించకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. అంతేకాదు, వారి వాహనాలపై ఇందుకు సంబంధించిన నోటీసులను కూడా అతికిస్తున్నారు. కాగా, ఢిల్లీ హోటల్ అసోసియేషన్ ఇప్పటికే ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News