Aamir Khan: కరోనా టెస్టులో మా అమ్మకు నెగెటివ్ రావాలని ప్రార్థించండి: ఆమిర్ ఖాన్

My staff tests corona positive says Aamir Khan

  • ఆమిర్ ఖాన్ స్టాఫ్ కు కరోనా పాజిటివ్
  • ట్విట్టర్ వేదికగా ప్రకటించిన అమీర్
  • బీఎంసీ అద్భుతంగా పని చేస్తోందంటూ కితాబు

బాలీవుడ్ కు సంబంధించి ఇప్పటికే పలువురు కరోనా బారిన పడ్డారు. తాజాగా స్టార్ హీరో ఆమిర్ ఖాన్ స్టాఫ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆమిర్ ఒక సుదీర్ఘ లేఖను పోస్ట్ చేశారు.

'నా స్టాఫ్ లో కొందరు కరోనా బారిన పడ్డారని తెలియజేస్తున్నాను. కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే అందరినీ క్వారంటైన్ చేశారు. సకాలంలో, అత్యంత వేగంగా స్పందించి నా స్టాఫ్ కు వైద్య సదుపాయాలను కల్పించిన బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్)కి ధన్యవాదాలు. నా సిబ్బంది పట్ల చాలా కేర్ తీసుకున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాలను స్టెరిలైజ్ చేశారు.

నా సిబ్బందిలోని మిగిలిన వారికి మాత్రం నెగెటివ్ అని తేలింది. టెస్ట్ చేయించుకోమని మా అమ్మకు చెపుతున్నా. మాకు సంబంధించిన వ్యక్తుల్లో ఆమే చివరి వ్యక్తి. ఆమెకు నెగెటివ్ రావాలని భగవంతుడిని ప్రార్థించండి.

కోకిలాబెన్ ఆసుపత్రికి కూడా పెద్ద థ్యాంక్స్. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందిస్తున్న సేవలు చాలా గొప్పవి. టెస్టింగ్ విషయంలో వారు చాలా జాగ్రత్తగా, ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తున్నారు. అందరూ సురక్షితంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ' అంటూ ఆమిర్ ట్వీట్ చేశారు. మరోవైపు ఆమిర్ సిబ్బందికి కరోనా పాజిటివ్ అనే సమాచారంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News