Naga Chaitanya: సమంత హీరోయిన్ అయితేనే... నాగ చైతన్యకు దర్శకుడు విక్రమ్ కుమార్ కండిషన్!

Director Vikram Kumar Condition to Naga Chaitanya
  • ప్రస్తుతం 'లవ్ స్టోరీ' చేస్తున్న చైతూ
  • ఆపై విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో చిత్రం
  • సమంత అంగీకారం కోసం ఎదురుచూపులు
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ'ని ప్రారంభించిన హీరో నాగ చైతన్య, ఆ తరువాత విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేయాలనుకుని ఆయన్ను సంప్రదించగా, తన చిత్రంలో హీరోయిన్ గా సమంత మాత్రమే ఉండాలన్న కండిషన్ పెట్టారట.

విక్రమ్ కండిషన్ కు చైతన్య ఒప్పుకున్నాడని తెలుస్తుండగా, సమంత మాత్రం 'ఓ బేబీ' తరువాత ఇప్పటివరకూ మరో చిత్రాన్ని అంగీకరించలేదు. ఇక తన భర్త పక్కన ఇంకో చిత్రంలో నటించేందుకు ఆమె అంగీకరిస్తుందా? అన్న విషయం వేచి చూడాలి. లాక్ డౌన్ కారణంగా అన్ని చిత్రాల షూటింగ్ లూ నిలిచిపోయిన నేపథ్యంలో ఈ సినిమా పట్టాలపైకి రావడానికి చాలా సమయమే పట్టొచ్చని తెలుస్తోంది.
Naga Chaitanya
Samantha
Vikram Kumar

More Telugu News