India: వారానికోసారి... ఇకపై క్రమం తప్పకుండా భారత్-చైనా చర్చలు

India and China agrees to meet regularly

  • ప్రతి వారం చర్చలు జరపాలని ఇరుదేశాల నిర్ణయం
  • సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించేందుకు నిరంతర సంప్రదింపులు, చర్చలు
  • ఇప్పటికే ఓసారి సమావేశం
  • తన వైపు మృతుల సంఖ్య వెల్లడించని చైనా

గత కొన్నిరోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఘర్షణల్లో ఇరువైపులా ప్రాణనష్టం జరిగిన అనంతరం సైనిక మోహరింపులు ఊపందుకున్నాయి. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు క్రమం తప్పకుండా చర్చలు జరపాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఇకపై ప్రతి వారం సమావేశమవుతామని కేంద్రం వెల్లడించింది. సమన్వయం కోసం సంప్రదింపులు, చర్చలు కొనసాగుతాయని కేంద్ర వర్గాలు తెలిపాయి.

తూర్పు లడఖ్ లో చైనా దూకుడుపై చర్చించేందుకు ప్రతివారం సమావేశం అయ్యేందుకు అంగీకారం కుదిరిందని, భారత ప్రతినిధి బృందంలో రక్షణ, హోం, విదేశాంగ శాఖల, సైనిక బలగాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని వివరించాయి. ఇప్పటికే ఓసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరిగిందని, గాల్వన్ లోయ ఘర్షణల్లో చైనా సైనికులు ఎంతమంది చనిపోయారో ఆ దేశ ప్రతినిధులు ఏమీ మాట్లాడలేదని భారత వర్గాలు తెలిపాయి.

India
China
Meeting
Weekly
Border
  • Loading...

More Telugu News