Jagan: ఎంఎస్‌ఎంఈలకు బకాయిల కింద రూ.512.35 కోట్లను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
- తొలి విడత కింద మే నెలలో రూ.450 కోట్లు విడుదల చేశామన్న సీఎం
- రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తక్కువ వడ్డీకే రుణాలు
- 6.8 శాతం వడ్డీకి రూ.200 కోట్ల రుణాలు ఇచ్చేలా నిధుల కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సాయం చేయడమే లక్ష్యంగా రెండో విడత రీస్టార్ట్ ప్యాకేజీ నిధులను ఈ రోజు సీఎం జగన్ విడుదల చేశారు. రెండో విడత బకాయిల కింద రూ.512.35 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తోంది. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి నిధులు విడుదల చేసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో జగన్ మాట్లాడారు.
తొలి విడత కింద మే నెలలో రూ.450 కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యవసాయం తర్వాత గ్రామాల్లో ఉపాధి కల్పించేవి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలేనని తెలిపారు. ఆ పరిశ్రమలకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నామని చెప్పారు. 6.8 శాతం వడ్డీకి రూ.200 కోట్ల రుణాలు ఇచ్చేలా నిధులు కేటాయించామని పేర్కొన్నారు.