Mumbai: ముంబైకి మళ్లీ పోటెత్తుతున్న వలస కార్మికులు!

Migrant workers coming back to mumbai
  • లాక్‌డౌన్ తర్వాత మహారాష్ట్రను వదిలిన 18 లక్షల మంది
  • లాక్‌డౌన్ సడలింపులతో మళ్లీ నగరానికి వస్తున్న కార్మికులు
  • బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ నుంచి పెద్ద మొత్తంలో రాక
లాక్‌డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకుపోయి ఆ తర్వాత ప్రభుత్వాల చొరవతో సొంతూళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికులు మళ్లీ నగరానికి పోటెత్తుతున్నారు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా కర్మాగారాలు, మెట్రో ప్రాజెక్టులు ప్రారంభం కావడంతో ఉపాధి కోసం మళ్లీ మహానగరంలో అడుగుపెడుతున్నారు. స్వగ్రామాలకు వెళ్లిపోయిన వారిలో దాదాపు ఐదున్నర లక్షల మంది మళ్లీ ముంబైలో అడుగుపెట్టినట్టు రైల్వే శాఖ నుంచి అందిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది. వీరిలో కార్మికులు, వ్యాపారులు ఉన్నారు. వీరిలో అత్యధికులు ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు ఉన్నారు.

జూన్‌కు ముందు మహారాష్ట్ర నుంచి 844 రైళ్లలో 18 మంది లక్షల మంది కార్మికులు స్వస్థలాలకు తరలిపోయారు. వారిలో ఇప్పుడు చాలా మంది తిరిగి ముంబై చేరుకుంటున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మందికిపైగా ముంబై వచ్చినట్టు వెస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రవీంద్ర భాకర్ తెలిపారు. ప్రత్యేక రైళ్లు నడిపిన‌ప్పుడు 70 శాతం సీట్లు మాత్ర‌మే నిండాయ‌ని‌, ఇప్పుడు వందకు వందశాతం సీట్లు బుక్ అవుతున్నట్టు చెప్పారు.
Mumbai
migrant workers
Lockdown
Maharashtra

More Telugu News