APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ అన్ని బస్సుల్లోనూ ఇక ఆన్ లైన్ టికెట్లు!
- ఏపీఎస్ఆర్టీసీ నూతన టికెటింగ్ విధానం
- నగదు, కాంటాక్ట్ రహిత టికెట్లు
- 30వ తేదీ అప్ డేట్ కోసం సర్వర్ మూసివేత
ఎటువంటి బస్ కైనా నగదు రహిత, కాంటాక్ట్ రహిత టికెటింగ్ విధానాన్ని రూపొందించాలని ఇప్పటికే నిర్ణయించిన ఏపీఎస్ ఆర్టీసీ, జులై 1వ తేదీ నుంచి కొత్త సేవలను అందుబాటులోకి తేనుంది. ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నామని, అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ టికెట్లను జారీ చేయనున్నామని అధికారులు వెల్లడించారు.
ఈ వినూత్న సేవలను సమర్థవంతంగా అందించేలా సర్వర్ లను అప్ గ్రేడ్ చేసేందుకు 30వ తేదీ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ ఆర్టీసీ వెబ్ సైట్ ను నిలిపివేస్తామని, ఆ సమయంలో అన్ని రకాల టికెట్ బుకింగ్, రద్దు సేవలు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు. ఒకేసారి 50 వేల మంది టికెట్లను పొందినా వెబ్ సైట్ పై ఒత్తిడి పడకుండా సేవలను అందిస్తామని తెలిపారు.