BeTech Student: గుంటూరు బీటెక్ విద్యార్థిని అశ్లీల వీడియోల కేసులో కొత్తకోణం

  • ఇద్దరు యువతుల ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు
  • వారి అరెస్ట్ కు రంగం సిద్ధం
  • బాధితురాలికి మూడేళ్లుగా వేధింపులు

గుంటూరులో మూడేళ్ల కిందట ఓ బీటెక్ విద్యార్థినిపై ఆమె సహవిద్యార్థులు అత్యాచారం చేసి ఆ వీడియోలతో బాధితురాలిని బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వరుణ్, కౌశిక్ అనే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులకు కూడా సంబంధం ఉన్నట్టు గుర్తించారు. బాధితురాలిపై చిత్రీకరించిన అశ్లీల వీడియోలను వరుణ్ స్నేహితురాలు కౌశిక్ సోదరికి పంపినట్టు తెలుసుకున్నారు. అక్కడినుంచి ఆ వీడియోలు అశ్లీల సైట్లలో అప్ లోడ్ అయినట్టు వెల్లడైంది.

గతంలో ఆ విద్యార్థినిని వరుణ్, కౌశిక్ ప్రేమ పేరిట నమ్మించి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి వీడియోలు తీశారు. అప్పటి నుంచి ఆమెను బెదిరిస్తున్నారు. వారి వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దిశ పోలీసులు ఈ ఘటనలో వరుణ్, కౌశిక్ అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న ఇద్దరు యువతులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.

  • Loading...

More Telugu News