Corona Virus: కరోనా కాలంలో రొమాన్స్ సీన్ షూటింగంటే... ఇలా ఫేస్ షీల్డ్ తప్పదేమో!

Romance with Face Sheild

  • ప్రపంచాన్ని మార్చేసిన కరోనా
  • ఇప్పుడిప్పుడే మొదలవుతున్న షూటింగ్స్
  • ప్రసూతన్ తో రొమాంటిక్ సీన్ పిక్ ను పోస్ట్ చేసిన అపర్ శక్తి

కరోనా వైరస్ ప్రపంచాన్ని మార్చివేసింది. ప్రజల ఆలోచనా విధానంపైనా ప్రభావం చూపింది. భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్ లు ధరించడం తప్పనిసరైంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన అన్ని రకాల కార్యకలాపాలూ ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. వందల మంది ఒకే చోట పనిచేసే వాతావరణం కనిపించే సినిమా షూటింగ్ లలో భౌతికదూరం సాధ్యమేనా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్న ఈ తరుణంలో బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ సోదరుడు అపర్ శక్తి ఖురానా తన సోషల్ మీడియాలో పంచుకున్న ఓ ఫోటో తెగ వైరల్ అవుతూ నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది.

ప్రస్తుతం అపర్ శక్తి ఖురానా 'హెల్మెట్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రసూతన్ హీరోయిన్. ఇందులో ఆమె కళ్లల్లోకి చూస్తూ హత్తుకునే ఓ సన్నివేశం ఉంది. ఆ సీన్ షూటింగ్ లాక్ డౌన్ కు ముందే ముగిసింది. ఇక ఆ రొమాంటిక్ సన్నివేశం తాలూకు ఫోటోను షేర్ చేసిన అపర్ శక్తి, ముందుగా షూటింగ్ జరిగిపోయింది కాబట్టి సరిపోయింది గానీ, లేకుంటే, ఇలా ఫేస్ షీల్డ్ పెట్టుకుని నటించాల్సి వచ్చేదంటూ క్యాప్షన్ పెట్టి ఓ ఫోటోను వదిలాడు. ఇందులో అపర్ శక్తి, ప్రసూతన్ ఫేస్ షీల్డ్ లు ధరించి, రోమాన్స్ చేస్తున్నట్టున్నారు.

ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. ఇక సినిమా షూటింగ్ లు రెగ్యులర్ గా జరిపే పరిస్థితి వస్తే, రొమాంటిక్ సీన్లను దర్శకులు ఎలా తెరకెక్కిస్తారో చూడాలని వుందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. అపర్ శక్తి ఆలోచన బాగుందని కితాబిస్తున్నారు.

Corona Virus
Apar Shakti
Romance
Shooting
Face Shield
  • Error fetching data: Network response was not ok

More Telugu News