Locust: తన ఇంటిపై దాడికి వచ్చిన మిడతల దండు వీడియోను షేర్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్!

Loctus Video Shared by Sehwag

  • నిన్న గురుగ్రామ్ పై మిడతల దాడి
  • జనావాసాల్లోకి వచ్చిన దండు
  • వైరల్ అయిన వీడియో

టీమిండియా మాజీ ఓపెనర్, డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంటిపై నిన్న మిడతల దండు దాడి చేయగా, అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. నిన్న మిడతలు ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ ను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. నిన్న మధ్యాహ్నానికే గురుగ్రామ్ ప్రాంతానికి మిడతలు రాగా, అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. తమతమ ఇళ్ల తలుపులను, కిటికీలను మూసి ఉంచాలని సూచించారు.

ఆపై సాయంత్రం ఈ దండు జనావాసాల్లోకి వచ్చింది. ఇవి అదే ప్రాంతంలో ఉన్న సెహ్వాగ్ ఇంటి మీదుగా కూడా వెళ్లాయి. గుంపుగా వెళుతున్న మిడతల వీడియోను సెహ్వాగ్ తీసి, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో మిడతల దండును వాలనీయకుండా, శబ్దాలు చేస్తుండటం కనిపిస్తోంది. ఈ వీడియోను మీరూ చూడవచ్చు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News