Alia Bhat: మళ్లీ తెలుగు పాఠాలకు బాలీవుడ్ భామ

Alia Bhat will attend Telugu classes

  • 'ఆర్ఆర్ఆర్'లో సీతగా అలియా భట్ 
  • తెలుగు నేర్చుకోవాలని ప్రయత్నాలు
  • తెలుగు ట్యూటర్ ని పెట్టుకున్న ముద్దుగుమ్మ  

మాతృభాష కాకుండా వేరే భాషా చిత్రాలలో నటిస్తున్నప్పుడు ఏ ఆర్టిస్టుకైనా మొదట్లో ఇబ్బందే. భాష తెలియకపోతే సెట్లో డైలాగులు సరిగా పలకలేరు సరికదా, అందుకు తగ్గా భావాలను కూడా సరిగా పలికించలేరు. అందుకే, బాలీవుడ్ భామలు దక్షిణాది సినిమాలలో నటిస్తున్నప్పుడు వెంటనే ఆయా భాషలను నేర్చేసుకుంటారు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా ప్రస్తుతం తెలుగు భాష నేర్చుకునే పనిలో వుంది.

ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో అలియా హీరోయిన్ గా నటిస్తోంది. చరణ్ సరసన సీత పాత్రలో ఆమె కనిపిస్తుంది. ఇక ఈ షూటింగు కోసం లాక్ డౌన్ కి ముందే తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నించింది. ముంబైలో ట్యూటర్ ని పెట్టుకుని కొన్ని రోజులు నేర్చుకుంది. అయితే, లాక్ డౌన్ రావడంతో ఆ క్లాసులకు బ్రేక్ పడింది. ఇప్పుడిక త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ మళ్లీ తెలుగు పాఠాలు మొదలెడుతుందట. మళ్లీ ట్యూటర్ ని పిలిపించుకుని త్వరలోనే తెలుగులో మాట్లాడేయాలని ఈ ముద్దుగుమ్మ ఆరాటపడుతోంది.    

Alia Bhat
Rajamouli
Ramcharan
Jr NTR
  • Loading...

More Telugu News