Tirumala: తిరుమలలో భారీవర్షం... రహదారులు జలమయం

Heavy rains lashes Tirumala shrine

  • తడిసిముద్దయిన తిరుమల క్షేత్రం
  • ఇబ్బందులకు గురైన భక్తులు
  • రాయలసీమలో చురుకుగా కదులుతున్న రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఏపీలోనూ రాయలసీమ ప్రాంతంలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఈ మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. జోరుగా వర్షం పడడంతో తిరుమల రహదారులన్నీ జలమయం అయ్యాయి. దాంతో భక్తులు పలు ఇబ్బందులకు గురయ్యారు. కాగా, రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్రలోనూ మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది. అటు, బీహార్ నుంచి చత్తీస్ గఢ్ మీదుగా విదర్భ తూర్పు ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుండగా, ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Tirumala
Rain
Monsoon
Rayalaseema
Andhra Pradesh
  • Loading...

More Telugu News