Smriti Irani: స్మృతీ ఇరానీ 21 ఏళ్ల వయసులో చేసిన వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేసిన ఏక్తా కపూర్

ekta kapoor shares smriti irani video

  • 1998లో మిస్ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొన్న స్మృతి
  • క్యాట్ వాక్‌ చేసిన సందర్భంగా వీడియో
  • రాజకీయాలంటే త‌న‌కెంతో ఆస‌క్తని వ్యాఖ్య
  • భారత్‌ గొప్పదేశమన్న స్మృతి

కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సినీ రంగంలోంచి రాజ‌కీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆమె మోడ‌లింగ్ చేశారు. 1998లో ఆమె మిస్ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొన్నప్పటి అరుదైన వీడియోను ఆమె స్నేహితురాలు బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ పోస్ట్ చేశారు.

క్యాట్ వాక్‌ చేస్తోన్న సందర్భంగా స్మృతీ ఇరానీ అప్పట్లో మాట్లాడుతూ.. రాజకీయాలంటే త‌న‌కెంతో ఆస‌క్తని తన గురించి పలు విషయాలు చెప్పారు. తన వయసు 21 అని, తనకు క్రీడలన్నా ఇష్టమని, భారత్‌ గొప్పదేశమని ఆమె అన్నారు.

ఇప్పుడు స్మృతీ ఇరానీ గొప్ప స్థితిలో ఉన్నారని, తన స్నేహితురాలిని చూసి  గ‌ర్వ‌ప‌డుతున్నానని ఏక్తా కపూర్ పేర్కొన్నారు. స్మృతీ ఇరానీకి ఉన్న విన‌యం, మాట నిల‌బెట్టుకునే త‌త్వ‌మే ఆమెను గొప్ప వ్య‌క్తిగా తీర్చిదిద్దాయని చెప్పారు.  
              

Smriti Irani
Viral Videos
BJP
  • Loading...

More Telugu News