raghurama krishnam raju: ఢిల్లీలో రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు

raghurama krishnam raju meet rajnath

  • ఢిల్లీలో పర్యటిస్తోన్న రఘురామకృష్ణం రాజు 
  • నిన్న లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను, ఈసీని కలిసిన నేత 
  • వైసీపీ జారీ చేసిన షోకాజు నోటీసు చెల్లుబాటు కాదంటున్న ఎంపీ

ఢిల్లీలో పర్యటిస్తోన్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఈ రోజు కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. ఆయన నిన్న లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను, ఎన్నికల కమిషన్‌ అధికారులను కలిసిన విషయం తెలిసిందే. బీజేపీ నేతలతో చర్చలు జరుపుతూ గతంలోనూ ఆయన చాలా సార్లు వార్తల్లోకెక్కారు.  

తనకు వైసీపీ జారీ చేసిన షోకాజు నోటీసు చెల్లుబాటు కాదని, దానిపై  ఏపీ సీఎం జగన్‌ సంతకం లేదని ఆయన అంటున్నారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదైన వైసీపీ అసలు పేరు, తనకు షోకాజు నోటీసుల్లో ఉన్న పార్టీ పేరు మధ్య కూడా వ్యత్యాసం ఉన్నట్లు ఆయన నిన్న ఈసీకి వివరించారు. తమ పార్టీలో క్రమశిక్షణ కమిటీ లేదని, తనపై చర్యలు ఎలా తీసుకుంటారని ఆయన వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ నేతలను కూడా కలుస్తుండడం ఆసక్తి రేపుతోంది.

raghurama krishnam raju
rajnath
BJP
YSRCP
  • Loading...

More Telugu News