AP Police: చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్

AP Police department thanked Chiranjeevi
  • నేడు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినం
  • ఏపీ పోలీస్ వెబినార్లో చిరంజీవి వీడియో సందేశం
  • ధన్యవాదాలు సర్ అంటూ ట్వీట్ చేసిన ఏపీ పోలీస్
నేడు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్ శాఖ నిర్వహించిన అవగాహన సదస్సులో చిరంజీవి వీడియో లింక్ ద్వారా సందేశం అందించారు. డగ్ర్స్ వాడకంతో యువత నిర్వీర్యం అవుతుండడం పట్ల తీవ్ర విచారం కలుగుతోందని చిరంజీవి వ్యాఖ్యానించారు. మాదక ద్రవ్యాలను విడనాడి జీవితంలో ఎదిగేందుకు కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. తమ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడం పట్ల ఏపీ పోలీస్ విభాగం ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. యాంటీ డ్రగ్స్ ప్రచారంలో మీ మద్దతుకు ధన్యవాదాలు సర్ అంటూ ట్వీట్ చేసింది.
AP Police
Chiranjeevi
Anti Drugs
World Anti Drugs Day
Andhra Pradesh

More Telugu News