Bollywood: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న బాలీవుడ్ నటుడు గోవింద కుమారుడు యశ్వర్ధన్

Yashvardhan Ahuja meets with car accident in Juhu
  • ఈ నెల 2న ఘటన.. తాజాగా వెలుగులోకి
  • యశ్వర్ధన్ కారును ఢీకొట్టిన మరో కారు
  • కేసు నమోదు చేయలేదన్న పోలీసులు
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద కుమారుడు యశ్వర్ధన్ అహుజా త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ నెల 2న ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. రాత్రి వేళ పార్టీ నుంచి తిరిగి వస్తుండగా ముంబైలోని జుహు వద్ద యశ్‌రాజ్ ఫిలిమ్స్‌కు చెందిన కారు యశ్వర్ధన్ కారును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో యశ్వర్ధన్‌తోపాటు అతడి డ్రైవర్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ఘటనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇరు వర్గాలు కలిసి చర్చించుకుని సమస్యను పరిష్కరించుకున్నట్టు పేర్కొన్నారు.
Bollywood
Actor Govinda
Car Accident

More Telugu News