VK Singh: రాజకీయాల్లో చేరికపై క్లారిటీ ఇచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్
- ఏ రాజకీయ నాయకుడూ రాష్ట్రాన్ని బంగారంగా మార్చలేడు
- ప్రజలు మాత్రమే ఆ పని చేయగలరు
- మహాత్మాగాంధీ, వివేకానంద, సుభాష్ చంద్రబోస్ బాటలో నడుస్తా
తనకు రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేదు కానీ, ప్రజలతో మాత్రం కలిసి పనిచేస్తానని సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ తెలిపారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన సింగ్ తన రాజీనామాను ఆమోదించాలంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరంగా అత్యంత శక్తమంతులైన ప్రజలు బలవంతుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఇందుకు రాజకీయ నాయకులను బాధ్యులను చేయలేమని, తప్పంతా ప్రజల్లోనే ఉందని అన్నారు. ఏ రాజకీయ నాయకుడూ రాష్ట్రాన్ని బంగారంగా మార్చలేరని చెప్పిన ఆయన ప్రజలు మాత్రమే ఆ పని చేయగలరన్నారు.
రాజకీయాల్లో చేరే ఉద్దేశం తనకు ఎంతమాత్రమూ లేదన్న వీకే సింగ్.. వివేకానంద, సుభాష్ చంద్రబోస్, మహాత్మాగాంధీ బాటలో నడుస్తూ ప్రజలతో కలిసి పనిచేస్తానని అన్నారు. అన్నాహజారే చేస్తున్న పనిని తాను కొనసాగిస్తానని పేర్కొన్నారు. తన రాజీనామాకు అనుమతి వచ్చిన తర్వాత తన ప్రణాళికను వివరిస్తానని, ప్రస్తుతం ప్రభుత్వాధికారిగా ఉంటూ ఆ విషయాలు మాట్లాడడం హుందాతనం అనిపించుకోదని పేర్కొన్నారు.