Hyderabad: బాలికపై అత్యాచారానికి తెగబడి.. చెబితే చంపేస్తానని బెదిరించిన కానిస్టేబుల్

Crime Constable raped 12 year girl in Hyderabad
  • తనకు భోజనం తీసుకొచ్చిన బాలికపై కానిస్టేబుల్ లైంగిక దాడి
  • రెండు నెలలపాటు బాధను తనలోనే దాచుకున్న బాలిక
  • నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు
హైదరాబాద్‌లో ఓ కానిస్టేబుల్ దారుణానికి తెగబడ్డాడు. 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కానిస్టేబుల్ ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. రెండు నెలల క్రితమే ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సిఖ్‌విలేజ్‌కు చెందిన వరదరాజ్ సుదేశ్ ఉమేశ్ (33) అక్కడి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతడి సోదరి కూడా సమీపంలోనే నివసిస్తోంది.

ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఉమేశ్‌కు తన కుమార్తెతో భోజనం పంపించింది. ఇంటికి వచ్చిన బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉమేశ్.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన బాలిక ఆ విషయాన్ని తనలోనే దాచుకుంది.

ఈ ఘటన తర్వాత ఉమేశ్ ఇంటికి వెళ్లమని తల్లి ఎన్నిసార్లు చెప్పినా వెళ్లేందుకు బాలిక నిరాకరించేది. దీంతో అనుమానం వచ్చిన తల్లి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుమార్తె చెప్పింది విని విస్తుపోయిన తల్లిదండ్రులు నిన్న బాలల హక్కుల సంఘంతోపాటు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
Hyderabad
sikh village
Rape case
crime constable

More Telugu News