Puducherry: పుదుచ్చేరి మాస్కుల తయారీ కంపెనీలో కరోనా కల్లోలం.. సీఎం ఆగ్రహం!

70 employees of corona company tested positive

  • 70 మంది కార్మికులకు కరోనా
  • కంపెనీ నిర్వాహకులపై కేసు
  • ప్లాంట్ ను సీజ్ చేయాలని ఆదేశాలు

కరోనా రక్కసి నుంచి ప్రజలను కాపాడేందుకు మాస్కులను తయారు చేస్తున్న కంపెనీ అది. అలాంటి కంపెనీపై కరోనా పంజా విసిరింది. పుదుచ్చేరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కంపెనీలో పని చేస్తున్న 70 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఈ ఘటనపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ  నిర్వాహకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మండిపడ్డారు. ప్లాంట్ ను వెంటనే సీజ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరోవైపు సీఎం ఆదేశాలతో సదరు కంపెనీ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

Puducherry
Mask Company
Corona Virus
  • Loading...

More Telugu News