Botsa Satyanarayana: కోడుమూరు ఎమ్మెల్యేకి.. బొత్స సత్యనారాయణ మేనల్లుడికి కరోనా పాజిటివ్

Botsa Satyanarayana nephew tested corona positive
  • ఏపీలో పంజా విసురుతున్న కరోనా
  • ప్రజా ప్రతినిధులకు సోకుతున్న కరోనా
  • హోం క్వారంటైన్ లో కోడుమూరు ఎమ్మెల్యే
ఏపీలో కరోనా వైరస్ పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. ప్రతి రోజు కొత్తగా వందలాది కేసులు నమోదవుతున్నాయి. ప్రారంభంలో కరోనాకు దూరంగా ఉన్న ఉత్తరాంధ్ర సైతం ఇప్పుడు కరోనాకు వణుకుతోంది. ప్రజాప్రతినిధులు సైతం దీని బారిన పడుతున్నారు. తాజాగా మంత్రి బొత్స కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. బొత్స మేనల్లుడు చిన్న శీను కరోనా బారిన పడ్డారు. దీంతో, ఆయనకు కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, ఆయన హోం క్వారంటైన్ కు వెళ్లిపోయారు. క్వారంటైన్ లోనే ఉండాలని తన  గన్ మెన్ కు కూడా ఆయన సూచించారు.
Botsa Satyanarayana
ysrcp
Kodumuru MLA
Sudhakar
Corona Virus

More Telugu News