Director: చైనా వస్తువులను తగలబెట్టిన తమిళ సినీ దర్శకుడు

Tamil film director set fire to china products

  • చైనాపై భారతీయుల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం
  • చైనా వస్తువులను బహిష్కరిద్దామంటూ క్యాంపెయిన్ కూడా ప్రారంభం
  • ఇకపై చైనా వస్తువులను కొనబోనన్న దర్శకుడు శక్తి చిదంబరం

చైనా సైనికుల దాడిలో 20 మందికి పైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాపై భారతీయులు రగిలిపోతున్నారు. చైనా వస్తువులను కొనడం ఆపేస్తే ఆ దేశానికి ఆర్థికంగా పెద్ద దెబ్బ తగులుతుందని పలువురు అంటున్నారు. బ్యాన్ చైనా ప్రాడక్ట్స్ అంటూ ఓ క్యాంపెయిన్ ని కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, తమిళ సినీ దర్శకుడు శక్తి చిదంబరం తన ఇంట్లో ఉన్న చైనా వస్తువులను తగలబెట్టారు. చైనాలో తయారైన సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, టేప్ రికార్డర్లను కుప్పగా పోసి, నిప్పటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చైనా సైనికులు దురాక్రమణకు పాల్పడ్డారని, మన సైనికులను హతమార్చారని చెప్పారు. చైనా వస్తువులపై నిషేధం విధించాలని... భారతీయులందరూ చైనా ఉత్పత్తులను వాడకుండా జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఇకపై తాను చైనా వస్తువులను కొనుగోలు చేయనని చెప్పారు.

Director
Shakthi Chidambaram
Kollywood
China Products
  • Loading...

More Telugu News