Thunderbolt: బీహార్ లో పిడుగుల వర్షం... 36 మంది బలి

Thunderbolts strikes in Bihar as many lives ended

  • అసమ్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి
  • బీహార్ లో కొన్నిరోజులుగా భారీ వర్షాలు
  • మరో 5 రోజులు భారీవర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ

బీహార్ లో పిడుగులు ప్రజల పాలిట మృత్యుఘంటికలు మోగించాయి. గత 24 గంటల వ్యవధిలో బీహార్ లోని పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పిడుగులు పడ్డాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా 36 మంది మృత్యువాత పడ్డారు. అసమ్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. బీహార్ లో కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు భారీవర్షాలు పడతాయని వాతావరణ విభాగం వెల్లడించింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో వరద భయంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరి అయితే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని అధికారులు స్పష్టం చేశారు.

Thunderbolt
Bihar
Deaths
Heavy Rains
Weather Forecast
  • Loading...

More Telugu News