Nagarjuna: మా ఫ్రెండు శిల్పారెడ్డికి, ఆమె భర్తకు కరోనా వచ్చింది... వాళ్లేం చెబుతున్నారో వినండి: నాగార్జున

Nagarjuna says his friend and her husband tested corona positive and recovered

  • కరోనా బారిన పడిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి
  • లక్షణాలేవీ లేకపోవడంతో హోం క్వారంటైన్
  • కరోనాను ఎదుర్కోవడం సులువేనన్న శిల్పారెడ్డి

టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున కరోనా వైరస్ వ్యాప్తిపై స్పందించారు. ప్రపంచంలోని ప్రతి చోట కరోనా తీవ్రమవుతున్న తరుణంలో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా, దృఢంగా ఉండడమే ఏకైక ఆయుధమని పేర్కొన్నారు. తన స్నేహితురాలు శిల్పారెడ్డికి, ఆమె భర్తకు కరోనా సోకిందని, అయితే వారు కరోనాను జయించారని నాగ్ వెల్లడించారు. అంతేకాదు, తమకు కరోనా పాజిటివ్ రావడంపై శిల్పారెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో రిలీజ్ చేయగా, నాగ్ ఆ వీడియోను పంచుకున్నారు. శిల్పారెడ్డి కరోనాపై ఏంచెప్పిందో మీరూ వినండి అంటూ సూచించారు.

శిల్పారెడ్డి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మోడల్, న్యూట్రిషనిస్ట్, ఫిట్ నెస్ నిపుణురాలు. ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా ఆమెకు, ఆమె భర్తకు కరోనా సోకింది. అయితే తమకు కరోనా లక్షణాలైన దగ్గు, జ్వరం, జలుబు ఏమీ లేవని, ముందు జాగ్రత్తగా టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని శిల్పారెడ్డి ఇన్ స్టా వీడియోలో వెల్లడించారు. లక్షణాలేవీ లేకపోవడంతో తాము హోం క్వారంటైన్ లో ఉన్నామని, కరోనా నుంచి కోలుకున్నామని వివరించారు.

ఇది ఎవరికైనా రావచ్చని, దీని పట్ల లేనిపోని అపోహలతో భయపడొద్దని తెలిపారు. శారీరక వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం, మానసికంగా దృఢంగా ఉండేందుకు ధ్యానం చేయడం ముఖ్యమని అన్నారు. కరోనాను ఎదుర్కోవడం చాలా సులభమని, శరీరానికి అవసరమైన విటమిన్లు తీసుకోవడం ద్వారా ఫిట్ గా ఉండొచ్చని చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News