petrol: వాహనదారుల గుండెల్లో గుబులు.. ఢిల్లీలో పెట్రోలును దాటేసిన డీజిల్ ధర

Diesel rate crosses petrol in Delhi

  • వరుసగా 19వ రోజూ పెరిగిన పెట్రో ధరలు
  • ఢిల్లీలో రూ. 80 దాటిన లీటర్ డీజిల్ ధర
  • గత 19 రోజుల్లో డీజిల్‌పై రూ.10.63, పెట్రోలుపై రూ.8.21 పెరుగుదల

ప్రతి రోజు పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. చమురు సంస్థలు నేడు కూడా ధరలు పెంచాయి. డీజిల్‌పై 14 పైసలు, పెట్రోలుపై 16 పైసలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. పెట్రో ధరలు పెరగడం వరుసగా ఇది 19వ రోజు. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ ధర లీటరు రూ.80 దాటేయగా, పెట్రోలు ధర రూ.79.92కు పెరిగింది. సాధారణంగా డీజిల్ ధరకంటే పెట్రోలు ధర అధికంగా ఉంటుంది. కానీ ఢిల్లీలో పెట్రోలు ధర కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉండడం గమనార్హం. తాజా పెంపుతో గత 19 రోజుల్లో పెట్రోలుపై రూ. 8.21 పెరగ్గా, డీజిల్ ధర లీటరుకు 10.63 రూపాయలు పెరిగింది.

petrol
Diesel
New Delhi
Hike
  • Loading...

More Telugu News