Dokka manikya varaprasad: డొక్కాకు వైసీపీ ఎమ్మెల్సీ టికెట్.. నేడు నామినేషన్.. గెలుపు ఏకగ్రీవమే!

Dokka got MLC ticket from ysrcp

  • ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ టికెట్
  • అధికారికంగా ప్రకటించని వైసీపీ
  • బరిలో లేని టీడీపీ

టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు ఆ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించింది. ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి జరగనున్న ఉప ఎన్నికలకు వైసీపీ అభ్యర్థిగా ఆయన పేరును పార్టీ ఖరారు చేసింది. నేడు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే, అధికారికంగా మాత్రం డొక్కా పేరును వైసీపీ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఆయనను ప్రతిపాదిస్తూ పదిమంది ఎమ్మెల్యేల సంతకాలతో నేరుగా నామినేషన్ వేయించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష టీడీపీ నుంచి బరిలో ఎవరూ లేకపోవడంతో డొక్కా గెలుపు ఏకగ్రీవం కానుంది. కాగా, నేటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది.

Dokka manikya varaprasad
YSRCP
MLC
TDP
  • Loading...

More Telugu News