Sonu Sood: విమర్శలపై స్పందించిన సోనూసూద్.. అవే తనకు కొండంత బలమన్న నటుడు

Sonu Sood responds about allegations

  • సంజయ్ రౌత్, నగ్మా విమర్శలపై స్పందించిన సోనూ సూద్
  •  ఆరోపణల గురించి ఇప్పటి వరకు పట్టించుకోలేదన్న నటుడు
  • మంచి పని చేస్తున్నప్పుడు చాలా వేళ్లు మనల్ని వేలెత్తి చూపిస్తాయన్న సోనూ సూద్

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వలస కార్మికులను ఆదుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. అయితే, శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేత నగ్మా వంటి వారు మాత్రం తప్పుబట్టారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తున్నాడని విమర్శించారు. తనపై వస్తున్న విమర్శలపై సోనూ సూద్ తాజాగా స్పందించాడు. విమర్శలు తనకు కొండంత బలాన్ని ఇస్తాయని, మరెన్నో మంచి పనులు చేసేందుకు తనలో ఉత్సాహాన్ని నింపుతాయని అన్నాడు. నిజానికి ఆ ఆరోపణలను ఇప్పటి వరకు తాను పట్టించుకోలేదని అన్నాడు.

తనపై విమర్శలు చేసిన సమయంలో ఎవరైనా వచ్చి వాటిపై స్పందించమని అడిగితే అప్పుడు ఒకటే చెప్పేవాడినని, వలస కార్మికులకు ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసే పనిలో తీరికలేకుండా ఉన్నాను కాబట్టి ప్రస్తుతానికి స్పందించే సమయం లేదని చెప్పేవాడినని అన్నారు. మంచి పని చేస్తున్నప్పుడు ఇలాంటివి సహజమేనన్నాడు. మంచి ఆలోచనతో ప్రజలకు సేవ చేయాలని భావించినప్పుడు చాలా మంది మనల్ని ఏదో ఒకటి అంటుంటారని, కానీ నిజానికి ఆ విమర్శలే తనకు మరింత బలాన్ని, స్ఫూర్తిని ఇస్తున్నాయని సోనూ సూద్ పేర్కొన్నాడు.

Sonu Sood
Bollywood
migrant workers
Corona Virus
  • Loading...

More Telugu News