Telangana: తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 891 కేసులు!

Corona cases in Telangana crosess 10K

  • తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 10,444
  • 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 719 కేసులు  
  • ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 225

తెలంగాణపై కరోనా రక్కసి కోరలు చాస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 891 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీంతో, రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,444కి చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల మార్కును దాటింది. మొత్తం కేసుల్లో 5,858 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 4,361 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 225 మంది ప్రాణాలు కోల్పోగా... గత 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు.

గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో 719 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్ జిల్లాలో 55 కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటితో పాటు సంగారెడ్డి, వరంగల్ రూరల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేట్, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల, వరంగల్ అర్బన్, గద్వాల్, పెద్దపల్లి, సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొత్తగా కేసులు నమోదయ్యాయి.

Telangana
Corona Virus
Cases
Updates
  • Loading...

More Telugu News