Telangana: గాంధీ ఆసుపత్రిలో కరోనా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

Corona clinical trials started in Gandhi Hospital

  • క్లినికల్ ట్రయల్స్ కు ఐసీఎంఆర్ అనుమతి
  • ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ట్రయల్స్
  • డ్రగ్ కనిపెట్టేందుకే ట్రయల్స్ అన్న కరుణాకర్ రెడ్డి

హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో కరోనా పేషెంట్స్ పై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఐసీఎంఆర్ అనుమతించడంతో ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీసీ, కరోనా కేసుల ఎక్స్ పర్ట్ కమిటీ మెంబర్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం తెలంగాణలో కరోనా మందుల కోసం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కరోనాకు డ్రగ్ కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా రీసర్చ్ జరుగుతోందని... ఇందులో భాగంగానే గాంధీలో కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

Telangana
Gandhi Hospital
Corona Virus
Clinical Trials
  • Loading...

More Telugu News