Keerthi Suresh: నితిన్ సరసన కీర్తి సురేశ్ కి మరో ఛాన్స్!

Keerthi Suresh to be cast opposite Nithin again

  • నితిన్ తో 'రంగ్ దే' సినిమాలో కీర్తి 
  • కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట'
  • రషెస్ చూసి కీర్తిని ఎంచుకున్న దర్శకుడు 

కెరీర్ ప్రారంభంలోనే 'మహానటి' సినిమాతో మంచి పెర్ఫార్మెర్ గా పేరుతెచ్చుకుని, అవార్డు సైతం అందుకున్న కథానాయిక కీర్తి సురేశ్ ఇటు తెలుగు చిత్రాలతో పాటు, అటు తమిళ సినిమాలలో కూడా నటిస్తోంది. గ్లామర్ పాత్రలతో పాటు అభినయానికి ఎక్కువ అవకాశం వుండే పాత్రలకు ఆమెను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె తెలుగులో నితిన్ సరసన 'రంగ్ దే' సినిమాలో నటిస్తోంది. విశేషం ఏమిటంటే, ఈ సినిమా ఇంకా సెట్స్ లో వుండగానే నితిన్ నటించే మరో సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ వచ్చింది.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ 'పవర్ పేట' అనే చిత్రాన్ని చేయనున్నాడు. ఇది నితిన్ కెరీర్ లోనే పవర్ ఫుల్ యాక్షన్ సినిమా అని అంటున్నారు. ఇందులో కథానాయికగా తాజాగా కీర్తి సురేశ్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల దర్శకుడు కృష్ణ చైతన్య 'రంగ్ దే' రషెస్ చూసి, తన సినిమాలోని పాత్రకు కీర్తి అయితేనే బాగుంటుందని నిర్ణయించుకుని ఆమెను ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు.

Keerthi Suresh
Nithin
Rangde
Power Peta
  • Loading...

More Telugu News