Regina: చాలా సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను: రెజీనా

I faced sexual harassment reveals actress Regina
  • లొంగదీసుకునేందుకు చాలా మంది యత్నించారు
  • ఓ యువకుడిని పబ్లిక్ గానే కొట్టాను
  • 'మిస్టర్ చంద్రమౌళి' సినిమా ప్రమోషన్ సందర్భంగా రెజీనా సంచలన వ్యాఖ్యలు
'శివ మనసులో శృతి' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రెజీనా... ఆ సినిమా ఆశించినంత ప్రేక్షకాదరణ పొందలేకపోయినా హీరోయిన్ గా నిలదొక్కుకోగలిగింది. ఆ తర్వాత వచ్చిన 'రొటీన్ లవ్ స్టోర్', 'పిల్లా నువ్వలేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' తదితర చిత్రాల ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇదే సమయంలో తమిళం, కన్నడ సినిమాల్లో కూడా నటిస్తోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ తాను అనేక సార్లు లైంగిక వేధింపులకు గురయ్యానంటూ సంచలన కామెంట్ చేసింది.

'మిస్టర్ చంద్రమౌళి' సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను లొంగదీసుకునేందుకు చాలా మంది యత్నించారని వ్యాఖ్యానించింది. తనను వేధించేందుకు యత్నించిన ఓ యువకుడిని పబ్లిక్ గానే కొట్టానని తెలిపింది. రెజీనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
Regina
Tollywood
Suxual Harassment

More Telugu News