Bhumika: సుశాంత్ మరణంపై భూమిక భావోద్వేగం!

- 'ధోనీ' చిత్రంలో సుశాంత్ తో కలిసి నటించిన భూమిక
- ఇద్దరి మధ్య నెలకొన్న ఆత్మీయ అనుబంధం
- దేవుడి చేతిలో భద్రంగా ఉంటావని నమ్ముతున్నానన్న భూమిక
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై నటి భూమిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మా అందరినీ వదిలి నీవు ఎందుకు ఎందుకు వెళ్లిపోయావంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 'నీవు మమ్మల్ని విడిచి వెళ్లిపోయి వారం దాటింది. నీవు మాకు ఎందుకు దూరమయ్యావనే రహస్యం నీతోనే వెళ్లిపోయింది. ఆ దేవుడి చేతిలో నీవు భద్రంగా ఉంటామని నమ్ముతున్నా' అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ 'ధోనీ' సినిమాలో ప్రధాన పాత్రను సుశాంత్ పోషించాడు. ఈ చిత్రంలో ధోనీ అక్క క్యారెక్టర్ ను భూమిక పోషించింది. ఈ సందర్భంగా సుశాంత్ తో ఆమెకు ఆత్మీయ అనుబంధం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సుశాంత్ మరణంతో ఆమె తీవ్రంగా కలత చెందారు.
