RGV: 'మారుతి వధించిన ప్రణాయామృత విషాద గాథ' అంటూ మరో 2 పోస్టర్లు విడుదల చేసిన ఆర్జీవీ

rgv releases few more posters

  • ప్రణయ్‌ పరువు హత్య ఆధారంగా మర్డర్‌ సినిమా
  • ఇటీవల ఫాదర్స్‌ డే సందర్భంగా మూవీ ఫస్ట్‌ లుక్
  • అమిత ప్రేమే అమిత ద్వేషానికి కారణమవుతుందని వ్యాఖ్య

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ పరువు హత్య ఆధారంగా మర్డర్‌ సినిమా తీస్తోన్న రామ్ గోపాల్‌ వర్మ ఇటీవల ఫాదర్స్‌ డే సందర్భంగా మూవీ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో మారుతీరావు, అమృత పాత్రలను పరిచయం చేశారు.  

               
           
తాజాగా ఇందుకు సంబంధించిన మరికొన్ని పోస్టర్లను ఆయన విడుదల చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మర్డర్‌ అనేది మారుతి వధించిన ప్రణాయామృత విషాద గాధ' అని ఆయన ఓ పోస్టర్‌ విడుదల చేశారు· 'అమిత ప్రేమే అమిత ద్వేషానికి కారణమవుతుందని, తీవ్ర హింసకు దారి తీస్తుందని పేర్కొంటూ ఆయన మరో పోస్టర్ విడుదల చేశారు.

RGV
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News