Khammam District: స్పోర్ట్స్ స్టేడియంపై 40 అడుగుల పీవీ సింధూ త్రీడీ చిత్రం!

PV Sindhu 40 Feet Painging on Sports Stadium

  • ఖమ్మం భవనంపై చిత్రం
  • అద్భుతంగా ఉందని కితాబు
  • గీసిన విజయ్, స్వాతి దంపతులు

ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు చిత్రం, ఇప్పుడు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంపై ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. నగర సుందరీకరణలో భాగంగా మునిసిపల్ అధికారులు, పలు ప్రాంతాల్లో దేశ నాయకులు, క్రీడాకారుల చిత్రాలను గీయిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్రకారులైన విజయ్, స్వాతి దంపతులు స్టేడియం బయటి గోడపై 40 అడుగుల ఎత్తయిన పీవీ సింధు త్రీడీ చిత్రాన్ని చిత్రించారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు.

Khammam District
Sports Stadium
PV Sindhu
  • Loading...

More Telugu News