Sikkim: చైనా మిలటరీ అధికారిపై భారత జవాను పిడిగుద్దులు... వీడియో ఇదిగో

India china Clash Video at Sikkim Border

  • సిక్కిం సమీపంలో మంచుకొండల మధ్య ఘటన
  • ఒకరిపై ఒకరు బాహాబాహీ
  • వైరల్ అవుతున్న వీడియో

సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున సిక్కిం సమీపాన మంచుకొండల్లో సరిహద్దుల వద్ద భారత్, చైనా సైనికులు గొడవ పడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. లడఖ్ సమీపంలో ఇరు దేశాల మధ్యా గొడవలు చెలరేగి, ఇరుపక్షాల సైనికులూ మరణించిన కొన్ని రోజుల తరువాత ఈ వీడియో బయటకు రావడం గమనార్హం. ఈ వీడియోలో చైనా మిలటరీ అధికారిపై భారత జవాను పిడిగుద్దులకు దిగినట్టు కనిపిస్తోంది. దాదాపు ఐదు నిమిషాల నిడివితో ఈ వీడియో ఉంది.

ఇరు పక్షాలూ "గో బ్యాక్", "డోంట్ ఫైట్" అంటున్న నినాదాలు ఈ వీడియోలో వినిపిస్తున్నాయి. నేలంతా మంచు నిండిపోయి కనిపిస్తుండగా, చైనా, భారత్ సైనికులు ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగారు. కొంతసేపటి తరువాత వివాదం సద్దుమణిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియో ఎప్పటిదన్న విషయమై స్పష్టత లేదు. ఎవరు షూట్ చేశారన్న విషయం కూడా తెలియరాలేదు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News