West Godavari District: పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా

7 members in a family infected to covid

  • పోడూరు మండలంలో ఘటన
  • అందర్నీ ఆసుపత్రికి తరలించిన అధికారులు
  • మండలంలో 38 మందికి కరోనా

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండల పరిధిలోని జిన్నూరు భూపయ్య చెరువు కాలనీలో ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా సోకింది. ఐదు రోజుల క్రితం కుటుంబంలోని ఓ మహిళకు కరోనా సంక్రమించింది. దీంతో కుటుంబంలోని ఏడుగురికీ పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫలితాలు రాగా అందరికీ కోవిడ్ సోకినట్టు తేలింది. దీంతో వారిని వెంటనే ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఇదే కాలనీలో మరొకరికి కూడా వైరస్ సోకింది. ఫలితంగా గ్రామంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 8 మందికి చేరింది. బాధితుల్లో ఆరుగురు మహిళలు కాగా, ఇద్దరు పురుషులు ఉన్నారు. బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మరోపక్క, ఇప్పటి వరకు మండలంలో 38 మంది కరోనా బారినపడగా, పోడూరులో ఐదు కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు.

West Godavari District
Podur mandal
Corona Virus
  • Loading...

More Telugu News