Hansika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Hansika signs a web serees

  • వెబ్ సీరీస్ కి ఓకే చెప్పిన మరో నాయిక 
  • ఫిలిం మేకింగ్ కోర్సు చేసిన నిఖిల్
  • నాలుగు దేశాలలో 'కరోనా' సినిమా షూటింగ్

*  అందాలతార హన్సిక కూడా డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశిస్తోంది. తొలిసారిగా ఈ ముద్దుగుమ్మ వెబ్ సీరీస్ లో నటించనుంది. 'భాగమతి' ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందే ఓ వెబ్ సీరీస్ లో హన్సిక నటించనుంది. దైనందిన జీవితంలో మన సమాజంలో మహిళలు ఎదుర్కునే కష్టాలు, సమస్యలపై ఇది రూపొందుతుంది.
*  లాక్ డౌన్ కాలంలో దొరికిన ఖాళీ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా సద్వినియోగం చేసుకున్నారు. అలాగే యంగ్ హీరో నిఖిల్ ఫిలిం మేకింగ్ లో ఆన్ లైన్ కోర్సు చేశాడట. గత మూడు నెలల నుంచి ఆన్ లైన్ క్లాసెస్ కు హాజరైనట్టు నిఖిల్ వెల్లడించాడు.
*  కరోనా వైరస్ నేపథ్యంలో తెలుగులో రూపొందే 'WHO' సినిమా షూటింగును నాలుగు దేశాలలో నిర్వహిస్తారు. అమెరికా, ఇటలీ, దక్షిణాఫ్రికా, ఇండో-చైనా బోర్డర్ లో దీని షూటింగ్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. వాసు పిన్నమరాజు దర్శకత్వంలో 'పలాస 1978' ఫేం రక్షిత్ హీరోగా ఈ సినిమా రూపొందనుంది.

Hansika
Ashok
Nikhil
Rakshith
  • Loading...

More Telugu News