Ramgopal varma: రాంగోపాల్‌వర్మ ‘మర్డర్‌‌’పై తీవ్రంగా స్పందించిన అమృత

Amrutha reacts on Ramgopal Varma Murder movie

  • వర్మ ఫస్ట్ లుక్ చూడగానే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది
  • వర్మ రూపంలో వచ్చిన కొత్త సమస్యను ఎదుర్కొనేంత శక్తి లేదు
  • రెండు నిమిషాల పేరు కోసం ఇంతటి నీచానికి దిగజారుతాడని అనుకోలేదు

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫాదర్స్ డే సందర్భంగా నిన్న విడుదల చేసిన ‘మర్డర్’ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌పై ప్రణయ్ భార్య అమృత తీవ్రంగా స్పందించారు. యథార్థ కథల ఆధారంగా సినిమాలను తెరకెక్కించే వర్మ ఈసారి ప్రణయ్, అమృతల ప్రేమ వ్యవహారం, కిరాయి మూకలతో మారుతీరావు చేయించిన పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. తన కథ ఆధారంగా వర్మ తీస్తున్న ‘మర్డర్’ సినిమాపై అమృత భావోద్వేగంగా స్పందించారు.

వర్మ విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూడగానే తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని అమృత అన్నారు. ప్రేమించిన వ్యక్తికి, కన్న తండ్రికి దూరమైన తన జీవితం తలకిందులైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే తప్పా? అని ప్రశ్నించారు. ఈ ఒక్క ఘటన వల్ల ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవంతో కాలం వెళ్లదీస్తున్న సమయంలో రాంగోపాల్ వర్మ రూపంలో మరో కొత్త సమస్య వచ్చి పడిందని, అయితే, దీనిని ఎదుర్కొనేంత శక్తి తనకు లేదని, ఏడ్చేందుకు కూడా కన్నీళ్లు రావడం లేదని అన్నారు.

రాంగోపాల్ వర్మ పోస్టర్ విడుదల చేస్తారని తెలిసినప్పటి నుంచి భయంతో వణికిపోయినట్టు చెప్పారు. కొడుకుతో కలిసి ఉన్నంతలో ప్రశాంతంగా బతుకుతున్న తన జీవితాన్ని బజారున పెట్టొద్దని వేడుకున్నారు. తమ పేర్లను ఉపయోగించి వర్మ తప్పుడు కథను అమ్ముకోవాలని చూస్తున్నాడని అన్నారు. రెండు నిమిషాల పేరు కోసం వర్మ లాంటి ప్రముఖ దర్శకుడు ఇంతటి నీచానికి దిగజారుతాడని ఊహించలేదన్నారు.

మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు వర్మను చూస్తే జాలేస్తోందని అన్నారు. తన కథ ఆధారంగా సినిమా తీస్తున్న వర్మపై కేసు వేయడం లేదని, ఎందుకంటే ఈ నీచ, నికృష్ట, స్వార్థపూరిత సమాజంలో అతడు కూడా ఒకడేనని అన్నారు. ఎన్నో బాధలు అనుభవించిన తనకు ఇది పెద్ద లెక్కలోకి రాదని పేర్కొన్న అమృత చివర్లో ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ ముగించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News