Vangalapudi Anitha: రాష్ట్రంలో 400 మందికి పైగా అఘాయిత్యాలకు గురైతే మహిళా కమిషన్ ఏంచేస్తోంది?: వాసిరెడ్డి పద్మపై అనిత ఆగ్రహం

Vangalapudi Anita take a jibe at Vasireddy Padma
  • అయ్యన్నపాత్రుడిపై వాసిరెడ్డి పద్మ ఫైర్
  • కౌంటర్ ఇచ్చిన టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత
  • దమ్ముంటే మంత్రులు అనిల్, వెల్లంపల్లిపై కేసు పెట్టాలని డిమాండ్
ఓ మహిళా అధికారిని దూషించిన వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయిస్తాం అంటూ  ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం తెలిసిందే. వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడిని ఎలాగైనా అరెస్ట్ చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు.

ఏడాదిగా రాష్ట్రంలో 400 మందికి పైగా మహిళలు అత్యాచారాలకు, హత్యలకు, దాడులకు గురవుతుంటే మహిళ కమిషన్ ఏంచేస్తోందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి మహిళా కమిషన్ నిద్రలేచిందని ఎద్దేవా చేశారు. దిశ చట్టానికి చట్టబద్ధత తీసుకురాలేని చవటలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో మంత్రులు అనిల్ కుమార్, వెల్లంపల్లి నోటికొచ్చినట్టు మాట్లాడారని, దమ్ముంటే వాళ్లపై కేసులు పెట్టాలని అనిత డిమాండ్ చేశారు.
Vangalapudi Anitha
Vasireddy Padma
Ayyanna Patrudu
YSRCP
Telugudesam

More Telugu News