Rajnath Singh: ఇక చైనాపై భూ, జల, వాయు మార్గాల్లో నిఘా

Union Defense Minister Rajnath Singh held a meeting with armed forces chiefs

  • సరిహద్దు ప్రాంతాల్లో చైనా దౌర్జన్యాలు
  • సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో రాజ్ నాథ్ మరోసారీ భేటీ
  • త్రివిధ దళాలకు పూర్తిస్వేచ్ఛ!

చైనాతో సరిహద్దు ఘర్షణలు మరింత ముదిరిన నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. లడఖ్ లో పరిస్థితులపై వారితో చర్చించారు. ఇకమీదట చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు.

భూ, జల, వాయు మార్గాల్లో చైనాపై నిఘా వేయాలని స్పష్టం చేశారు. చైనా ఎలాంటి దుశ్చర్యలకు ప్రయత్నించినా దీటుగా బదులివ్వాలని నిర్ణయించారు. చైనా సైనికుల దుస్సాహసానికి గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండాలంటూ త్రివిధ దళాలకు వివరించారు. చైనాతో సరిహద్దుల్లో వ్యూహాత్మక విధానం అనుసరించాలని తీర్మానించారు.

ఈ మేరకు సాయుధ దళాలకు కేంద్ర రక్షణ శాఖ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.  కాగా, రాజ్ నాథ్ సింగ్ రేపు రష్యా పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 24న మాస్కోలో జరిగే రష్యా విక్టరీ డే మిలిటరీ పెరేడ్ లో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News