Nara Lokesh: ఎప్పటికీ మీరే నా బెస్ట్ ఫ్రెండ్... థాంక్యూ నాన్నా: నారా లోకేశ్

Nara Lokesh tweets on Chandrababu in the wake of World Fathers Day

  • నేడు వరల్డ్ ఫాదర్స్ డే
  • తండ్రి తనపై అపారమైన ప్రేమ చూపేవారని వెల్లడించిన లోకేశ్
  • తండ్రితో తనతో గడిపిన క్షణాలు ఎంతో ప్రత్యేకమంటూ ట్వీట్

వరల్డ్ ఫాదర్స్ డే సందర్భంగా టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. "పనులన్నీ ముగించుకుని నాన్న ఇంటికి ఎంతో ఆలస్యంగా రావడమే కాదు, మళ్లీ వేకువజామునే వెళ్లిపోయేవారు. ఎప్పుడూ ఇంతే! మధ్యలో దొరికిన కాస్త సమయంలోనే నాతో గడిపేవారు. నాపై ఆయన చూపే స్వచ్ఛమైన ప్రేమ నాకెంతో ప్రత్యేకం. థాంక్యూ నాన్నా... ఎప్పటికైనా మీరే నా బెస్ట్ ఫ్రెండ్, మీరే నా గురు" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. అంతేకాదు, తండ్రితో ఉన్న ఫొటోను కూడా పంచుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News