Jagan: నాన్నే మనకు తొలి గురువు, తొలి హీరో: సీఎం జగన్

CM Jagan wishes every father on World Fathers Day
  • ఇవాళ ఫాదర్స్ డే
  • ప్రతి తండ్రికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
  • తండ్రే తన స్ఫూర్తి, తన బలం అని వెల్లడి
జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ తండ్రే తనకు స్ఫూర్తి, బలం అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగా ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ప్రతి తండ్రి తన పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తారని, పిల్లలకు ప్రేమను, స్ఫూర్తిని పంచుతారని తెలిపారు. నాన్నే మనకు తొలి గురువు, స్నేహితుడు, హీరో అని వివరించారు. మన సంతోషాలన్నీ ఎక్కువగా నాన్నతోనే పంచుకుంటామని పేర్కొన్నారు. ప్రతి తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
Jagan
Fathers Day
Wishes
YSR
Andhra Pradesh

More Telugu News