petrol: దేశ చరిత్రలో తొలిసారి వరుసగా 15వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు

Petrol price hiked

  • పెట్రోలుపై లీటరుకు 35 పైసలు పెరుగుదల
  • డీజిల్‌పై లీటరుకు 60 పైసల పెంపు
  • 15 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.7.97 పెరుగుదల
  • డీజిల్‌ ధర రూ.8.88 పెంపు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 15వ రోజు కూడా పెరిగాయి. దేశ చరిత్రలో వరుసగా 15 రోజుల పాటు వాటి ధరలు పెరగడం ఇదే తొలిసారి. పెట్రోలుపై లీటరుకు 35 పైసలు, డీజిల్‌పై లీటరుకు60 పైసలు పెరిగాయి. 15 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.7.97, డీజిల్‌ ధర రూ.8.88 పెరగడం గమనార్హం. ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.78.88కి, డీజిల్ ధర రూ.77.67కి చేరింది. రాష్ట్రాల పన్ను విధింపును బట్టి ఆయా రాష్ట్రాల్లో పెట్రోలు ధరల్లో తేడాలు ఉంటాయి. 

petrol
India
New Delhi
  • Loading...

More Telugu News