Tahawwur Rana: ముంబై దాడుల నిందితుడు తహవూర్ రాణాను మరోమారు అదుపులోకి తీసుకున్న అమెరికా

Pak Origin Plotter Of Mumbai Attacks Arrested In US

  • ఉగ్రవాదులకు ఆర్థిక సాయం కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష
  • వారం రోజుల క్రితమే జైలు నుంచి విడుదల
  • భారత్ విజ్ఞప్తితో జైలు నుంచి విడుదలైన రెండు రోజులకే అరెస్ట్

26/11 ముంబై దాడులకు ఆర్థిక సాయం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మూలాలున్న కెనడా వ్యాపారవేత్త తహవూర్ రాణా (59)ను అమెరికా పోలీసులు మరోమారు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం నేరంపై షికాగో కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించగా, తహవూర్ ఇప్పటికే పదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్నాడు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి కారణాలతోపాటు ఆరోగ్యం క్షీణించడంతో వారం రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు.

తహవూర్‌ను తమకు అప్పగించాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన అమెరికా అతడు జైలు నుంచి విడుదలైన రెండు రోజులకే లాస్ఏంజెలెస్ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. భారత్, అమెరికా మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాల మేరకే అతడిని అరెస్ట్ చేసినట్టు అమెరికా అసిస్టెంట్ అటార్నీ జాన్ ఎల్ జూలెజియన్ పేర్కొన్నారు.

కాగా, ముంబై దాడుల ప్రధాన నిందితుడైన డేవిడ్ హెడ్లీకి తహవూర్ అత్యంత సన్నిహితుడు. దాడులకు ముందు రెక్కీ కూడా నిర్వహించాడు. 26 నవంబరు 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News